Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsTelanganaYouth

కొత్త ఓటర్ల నమోదుకు అక్టోబరు 31 చివరి గడువు

కొత్త ఓటర్ల నమోదుకు అక్టోబరు 31 చివరి గడువు

అందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచన

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

నెల రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని,  అక్టోబరు 31వ తేదీకల్లా 18 సంవత్సరాలు నిండే ప్రతిఒక్కరూ నమోదు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంకఅల ఓ ప్రకటనలో కోరారు.  ఓటుహక్కు నమోదు గురించి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో అవగాహన కల్పిస్తూ, విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు  ఆమె చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతివ్యక్తి ఓటు నమోదుకు అర్హుడేనని, ఈ ఎన్నికల్లో ఓటువేయాలంటే అక్టోబరు 31లోపు కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైతే కొత్తగా ఓటు దరఖాస్తుకు అవకాశం ఉండదని, నవంబరులో మొదటి వారంలో అభ్యర్థుల నామినేషన్లు మొదలు  కానుండటంతో అక్టోబరు నెలాఖరునే కొత్త  ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు చివరి తేదీగా ఎన్నికల కమిషన్ నిర్ణయించిందని కలెక్టర్ చెప్పారు. విద్యాభ్యాసం, ఉద్యోగాల  రీత్యా పుట్టిన ఊరుకు  దూరంగా ఉంటున్న వ్యక్తులు ఆన్లైన్ విధానంలో కూడా నూతన ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ www.nvsp.in.
voters.eci.gov.in తో పాటు రాష్ట్రానికి సంబంధించిన www.ceotelangana.nic.
in వెబ్ సైట్ ద్వారా నమోదుకు అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఉచిత డయల్ నంబర్ 1950కు ఫోన్ చేసినా తగిన సమాచారం ఇస్తామని, జాబితాలో పేరు లేకపోయినా, పేరులో ఏమైనాదోషాలున్నా నెలాఖరులోపే సరిచేసుకోవాలని  తెలిపారు. ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు చాలా ప్రాధాన్యత కలిగినదని, అర్హులైన వారంతా  బాధ్యతగా ఓటరుగా నమోదు కావాలని చెప్పారు.

Related posts

గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్

Divitimedia

పార్ట్ టైం ఫ్యాకల్టీగా పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం

Divitimedia

నిరుపేద మహిళలకు గొడుగుల పంపిణీ

Divitimedia

Leave a Comment