అనుబోస్ ఇంజినీరింగ్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు
వసతులు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
✍🏽 దివిటీ మీడియా – పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం జిల్లా ఉన్నతాధికారులు పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలను ఎంపిక చేశారు. ఈ మేరకు గురువారం కళాశాలలో ఈవీఎంలు భద్రపర్చేందుకు స్ట్రాంగు రూమ్ ఏర్పాటుకు ఓట్ల లెక్కింపుకోసం అందుబాటులో ఉన్న వసతులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల, ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని పరిశీలించారు. గతంలో శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆ కళాశాల్లో స్ట్రాంగ్ రూముతోపాటు ఓట్లులెక్కింపుకేంద్రం కూడా ఏర్పాటు చేసినందున అప్పటి ఏర్పాట్లుపై అధికారులనడిగి తెలుసుకున్నారు. తాజా పరిస్థితులకనుగుణంగా పలు సూచనలు చేశారు. నవంబర్ 30న పోలింగ్ ముగిసిన తర్వాత జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఈవీఎంలు పటిష్ట భద్రతతోపాటు రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు తదితర సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, ఆర్.అండ్.బి ఈఈ భీంలా, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, కొత్తగూడెం రిటర్నింగ్ అధికారి శిరీష, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.