పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి : ఎస్పీ డా.వినీత్
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ఎంతోమంది పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితంగానే అందరం స్వేచ్చావాయువులు పీల్చగలుగుతున్నామని, అలాంటి అమర వీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ(ఫ్లాగ్ డే) కార్యక్రమాల సందర్భంగా అక్టోబర్ 21నుంచి 30వ తేదీ వరకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతిరోజూ ఏదో ఒక రకమైన వ్యాయామం చేయడం ద్వారా ప్రతిఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఆ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. లక్ష్మీదేవిపల్లి సెంట్రల్ పార్క్ నుంచి ప్రారంభమై ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద ‘యు టర్న్’ తీసుకుని రైల్వే స్టేషన్, బస్టాండ్, పోస్టాఫీస్ సెంటర్ నుంచి విద్యానగర్ కాలనీ బైపాస్ వరకు, అక్కడ తిరిగి యు టర్న్ తీసుకుని మళ్లీ పోస్టాఫీస్ సెంటర్ నుంచి సింగరేణి హెడ్డాఫీస్, గోధుమ వాగు బ్రిడ్జి మీదుగా రామవరం, 2వ టౌన్ పోలీస్ స్టేషన్ ల నుంచి రుద్రంపూర్ పార్క్ వరకు ఈ సైకిల్ ర్యాలీ సాగింది. ఈ సైకిల్ ర్యాలీలో దాదాపు 150 మంది దాకా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీ ముగిసిన అనంతరం పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పోలీస్ అమరవీరుల స్మారక మెడల్స్ అంద జేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయిమనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయబాబు, సీఆర్పీఎఫ్అధికారులు రితేష్ తాకూర్, సెంతిల్ కుమార్, కమల్ వీర్ యాదవ్, రజిత, సందీప్ రెడ్డి, 6వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ అంజయ్య, డీఎస్పీలు రెహమాన్, వెంకటేష్, రాఘవేందర్రావు, రమణమూర్తి, మల్లయ్య స్వామి, సీతారామ్, సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.