Divitimedia
Bhadradri KothagudemPoliticsTechnologyTelangana

ఐడీఓసీలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ప్రారంభించిన కలెక్టర్

ఐడీఓసీలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ప్రారంభించిన కలెక్టర్

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమును జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంకఅల శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికలసంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని చెప్పారు. ప్రవర్తనా నియమావళిని అమలు చేయడంలో భాగంగా పటిష్ఠమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఆ తనిఖీల్లో లభించిన నగదు, విలువైన బహుమతులు, తదితర సామాగ్రి ట్రెజరీ అధికారుల పర్యవేక్షణలో ఉంచేందుకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద 24గంటలూ పటిష్టమైన పోలీస్ బందోబస్తు, నిరంతరం నిఘా ఉంటుందని చెప్పారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో ఐడీఓసీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆర్.అండ్.బి అధికారులకు సూచించగా, సత్వరమే అది అందుబాటులోకి తెచ్చినందుకు కలెక్టర్ ఆ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ మధుసూదన్ రాజు, సహకార అధికారి వెంకటేశ్వర్లు, డీపీఆర్ఓ శ్రీనివాస్, ఏటీఓ మీనాక్షి, ఎన్టీఓ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
———————
రిటర్నింగ్ అధికారులు ప్రతి బ్యాలెట్ యూనిట్ నిశితంగా పరిశీలించాలి: కలెక్టర్
——————–

నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు ప్రతి బ్యాలెట్ యూనిట్ ను నిశితంగా పరిశీలన చేయాలని భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. ఈ మేరకు శనివారం ఆర్డీఓ కార్యాలయంలోని ఈవీఎం వేర్ హౌస్ నుంచి నియోజకవర్గం కేంద్రాలకు పంపుతున్న ఈవీఎం, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ర్యాండమైజేషన్ నిర్వహించి జిల్లా లోని ఐదు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 1095 పోలింగ్ కేంద్రాలకు పంపుతున్నట్లు చెప్పారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల సామగ్రి భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్ట్రాంగు రూముల వద్ద పటిష్టంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూములో భద్రపరచాలని, ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫి చేయించాలన్నారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూముకు సీలు వేయడం జరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, కొత్తగూడెం ఆర్డీఓ శిరీష, తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రమణ ప్రివెంటివ్ అరెస్టు

Divitimedia

ప్రగతి విద్యానికేతన్ లో వైభవంగా ఉపాధ్యాయ దినోత్సవం

Divitimedia

ఓటరు జాబితాలో మీ ఓటు ఉందో, లేదో చూసుకోండి…

Divitimedia

Leave a Comment