కచ్ ప్రాంతంలోని ధోర్డో గ్రామానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు
ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించిన ప్రపంచ పర్యాటక సంస్థ
✍🏽 దివిటీ మీడియా – పర్యాటక విభాగం
గుజరాత్ రాష్ట్రం కచ్ ప్రాంతంలోని ధోర్డో గ్రామానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యు.ఎన్.డబ్ల్యు.టి.ఒ) నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ గ్రామాన్ని ‘బెస్ట్ టూరిజం విలేజ్ (ఉత్తమ పర్యాటక గ్రామం)’ గా ఆ సంస్థ గుర్తించింది. ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ నుంచి ఈ డేరా నగరంలో ‘రాన్ ఉత్సవ్’ పేరుతో వార్షిక సాంస్కృతిక మహోత్సవం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ గ్రామానికి ‘ఉత్తమ పర్యాటక గ్రామం’గా ఐక్యరాజ్య సమితి గుర్తింపు లభించడం పట్ల పలువురు కేంద్రమంత్రులు హర్షం వ్యక్తం చేశారు.