పాల్వంచలో అందరికీ నవంబర్ నెలాఖరు లోగా మంచినీరందాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
పాల్వంచ పట్టణవాసులందరికీ నవంబర్ నెలాఖరుకల్లా పూర్తిస్థాయిలో మంచినీటి సరఫరా జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. ప్రియాంకఅల ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశమందిరంలో జిల్లా పబ్లిక్ హెల్త్, మున్సిపల్, మిషన్ భగీరథ విభాగం అధికారులతో మంచినీటి సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పనుల పురోగతిపై ఆరా తీశారు. పాల్వంచ మున్సిపాలిటీపరిధిలోని మిషన్ భగీరథ (అర్బన్) పనులను సమీక్షించారు. పైపులైన్లతోపాటు ట్యాంకులు త్వరగా పూర్తి చేయాలని, నవంబర్ నెలాఖరుకల్లా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా జరగాలని పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ అధికారులను ఆమె ఆదేశించారు. ట్యాపింగ్ పాయింట్లతో పూర్తిస్థాయిలో నీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ. స్వామి, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ నళిని, ఇంట్రా ఈఈ తిరుమలేష్, మున్సిపల్ డీఈ మురళి, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.