గిరిజన దర్బార్ నిర్వహించిన ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
భద్రాచలం ఐటీడీఏ సమావేశమందిరంలో పీఓ ప్రతీక్ జైన్ సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించి, ఆదివాసీ, గిరిజన గ్రామాల నుంచి వచ్చిన గిరిజనుల అర్జీలు స్వీకరించి పరిష్కారం కోసం ఆదేశించారు. ఈ మేరకు ఆయన తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి మిగతావి సంబంధిత అధికారులకు పంపించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు తప్పనిసరిగా అందేలా ప్రత్యేకచర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ అధికారులను ఆదేశించారు. గిరిజనదర్బార్ కార్యక్రమంలో పోడుభూముల సమస్యలు, పట్టాభూములకు రైతుబంధు రుణాలు, భూ సమస్యలు, గిరిజన గురుకుల పాఠశాలలు, ఇఎంఆర్ఎస్ పాఠశాలల్లో సీట్లకోసం, బోరు, మోటార్లకు వ్యవసాయ విద్యుత్తు, ఉద్యోగ అవకాశాల కోసం, గిరిజన గ్రామాల్లో మంచి నీరు రావట్లేదని గిరిజనులు దరఖాస్తులు చేసుకున్నారని పీఓ పేర్కొన్నారు. అర్హులైన గిరిజనులందరికీ విడతల వారీగా, తప్పని సరిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలందించేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఏపీఓ (జనరల్), గురుకులం ఇంచార్జ్ డేవిడ్ రాజ్, డిడి (ట్రైబల్ వెల్ఫేర్) మణెమ్మ, ఈఈ (ట్రైబల్ వెల్ఫేర్) తానాజీ, డిటి(ఆర్ఓఎఫ్ఆర్) శ్రీనివాస్, ఏపీఓ(పవర్) మునీర్, ఏడీ(అగ్రికల్చర్) ఉదయభాస్కరన్, జేడీఎం హరికృష్ణ, మేనేజర్ ఆదినారాయణ, గురుకులం ఏవో నరేందర్, ఎస్డీసీ నుంచి వెంకటేశ్వర్లు, ఎల్టీఆర్ నుంచి బాలమల్లు, డీఎంహెచ్ఓ నుంచి ప్రసాద్, మణికుమారి, నాగభూషణం, అపర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.