ఐటీసీ-రోటరీక్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
✍🏽 దివిటీ మీడియా – సారపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఐటీసీ అనుబంధ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్‌భద్రా సంస్థ ఆధ్వర్యలో స్థానిక గాంధీనగర్ కాలనీలో సోమవారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరల్, ఫ్లూ జ్వరాలు ఎక్కువగా ఉన్నందున పేదల కోసం ఈ వైద్య సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ పీఎస్ పీడీ సంస్థ వైద్యులు డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ నిఖిల్, డాక్టర్ అమృత పాల్గొని 304 మంది పేషంట్లకు సేవలందించారు. డాక్టర్ల సిఫార్సు మేరకు రోగులకు అవసరమైన మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఐటీసీ పీఎస్ పీడీ సారపాక యూనిట్ హెడ్ సిద్ధార్థమహంతి, హెచ్ఆర్ జీఎం, రోటరీక్లబ్ సభ్యులు శ్యామ్ కిరణ్, భాస్కరరావు, కునిసెట్టి రాంబాబు, చెంగల్ రావు, తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా ప్రెసిడెంట్ జయంత్ కుమార్ దాస్, సెక్రెటరీ కె వి ఎస్ గోవిందరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా సభ్యులు సమంత ప్రఫుల్, శివరాంకృష్ణన్, నాగమల్లేశ్వరరావు, పాకాల దుర్గాప్రసాద్, మరడన శ్రీనివాస్, బి.కిషోర్, ఖాదర్, సాయిరాం, బసప్ప రమేష్, సత్యనారాయణ, వీవీఎన్ ప్రసాద్, సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఏసోబు, కేవీ రావు, జలగం చంద్రశేఖర్, కోకిరాల సురేష్, రంజిత్, రోటరాక్ట్ ప్రెసిడెంట్ నీలి మురళి, సెక్రెటరీ గాయత్రి, చైతన్య, వెన్స్లస్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.