ప్రజావాణి కార్యక్రమం నిర్వహించిన డీఆర్ఓ
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సోమవారం అందుబాటులో లేకపోవడంతో ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్ఓ) ఎం.వి రవీంద్రనాథ్ నిర్వహించారు. జిల్లా పరిధిలో పలు ప్రాంతాల నుంచి, తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజలు, తమ వినతులు స్వీకరించి పరిష్కరించేందుకు కలెక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల నిరాశ చెందారు. కలెక్టరుకే నేరుగా తమ విజ్ఞప్తులందిస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం వెల్లడి చేశారు. ప్రజల ఫిర్యాదులు, దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసిన డీఆర్ఓ, పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నిశాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.