Divitimedia
Bhadradri KothagudemMuluguPoliticsTelangana

‘కోడ్’ కూసేలోగానే… పనులు ప్రారంభించి…

‘కోడ్’ కూసేలోగానే… పనులు ప్రారంభించి…

భద్రాచలం నియోజకవర్గంలో హడావుడిగా మంత్రి పర్యటన

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం

ఎన్నికల ప్రకటన వెలువడే సమాచారంతో, ‘కోడ్’ ఆమలులోకి రాకముందే రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం జిల్లా ఉన్నతాధికారులతో కలిసి హడావుడి నడుమ అధికారిక కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసుకున్నారు. ఆయన భద్రాచలంలో ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేయాల్సిన కార్యక్రమాలు నిర్వహించారు. భద్రాచలం పట్టణంలో రు.15.10కోట్ల వ్యయంతో పలు అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ చివరి రోజు కేంద్ర ఎన్నికలసంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన చేయకముందే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ మేరకు భద్రాచలం, చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, వాజేడు మండలాల్లో పలు అభివృద్ది పనులకు, భద్రాచలం అంబేడ్కర్ సెంటర్లో పువ్వాడ శంకుస్థాపనలు చేశారు.
భద్రాచలం పట్టణంలో రూ.2.60 కోట్లతో నిర్మించబోతున్న సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ పనులకు శంకుస్థాపనలు చేశారు.
పట్టణంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సమగ్ర కూరగాయల మార్కెట్ సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
పట్టణంలో రూ.1.10 కోట్లతో నిర్మించనున్న సీసీ రహదారులు, సీసీ డ్రైనేజీల పనులకు శంకుస్థాపన చేశారు. భద్రాచలం పట్టణంలో సుభాష్ నగర్ కాలనీ వద్ద రూ.38 కోట్లతో నిర్మించనున్న మిగులు కరకట్ట పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో రూ.21.50 లక్షలతో నిర్మించిన కిచెన్ కాంప్లెక్స్, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు. దుమ్ముగూడెం మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న సీసీ రహదారులు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చర్ల గ్రామ పంచాయతీ పరిధిలో రూ.50లక్షలతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.1.50 కోట్లతో నిర్మించనున్న సీసీ రహదారులు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వెంకటాపురం మండల కేంద్రంలో రూ.1కోటి వ్యయంతో చేపట్టనున్న సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో రూ.73.50 లక్షలతో నిర్మించనున్న సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గొల్లగూడెం గ్రామంలో రూ.71.50లక్షలతో నిర్మించనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. మరికెలలో రూ.38.50 లక్షలతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదే
మండలంలోని గ్రామాల్లో రూ.1.66 కోట్లతో చేపడుతున్న సీసీ రహదారులు, చెరువుల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.
వాజేడు మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.1.50కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రహదారుల పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జిల్లా కలెక్టర్ ప్రియాంకఆల, జడ్పీ సీఈఓ విద్యాలత, జిల్లా ఎస్పీ డా.వినీత్, డీసీహెచ్ఎస్ రవిబాబు, పంచాయతీరాజ్ డీఈ మంగ్య, నీటిపారుదల శాఖ అధికారి వెంకటేశ్వరరెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల పరిశీలించిన నోడల్ అధికారి

Divitimedia

కలెక్టర్ కార్యాలయంలో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు

Divitimedia

ఆరోగ్య మహిళాకేంద్రం ప్రారంభించిన కలెక్టర్

Divitimedia

Leave a Comment