రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు
రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ‘తెలంగాణ రైతుబంధు సమితి’ ఛైర్మన్ గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ‘టీఎస్ ఆర్టీసీ’ ఛైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ‘మిషన్ భగీరథ’ వైస్ ఛైర్మన్ గా ఉప్పల వెంకటేష్ గుప్తా, ‘ఎంబీసీ కార్పొరేషన్’ ఛైర్మన్ గా నందికంటి శ్రీధర్ ను ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఈ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.