కొండరెడ్లకు ఓటుహక్కు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు
కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు
కొండకోనల్లో నివసించే కొండరెడ్లకు ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. హైదరాబాదులో గురువారం టెక్ మహీంద్రా లెర్నింగ్ సెంటర్ లో ఓటుహక్కు నమోదు, ఓటు వినియోగం తదితర అంశాలపై విద్యార్థులకు జిల్లాలలో వివిధ అంశాలపై నిర్వహించిన పోటీలలో గెలుపొందినవారందరూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ మాట్లాడుతూ కొండరెడ్లకు ఓటుహక్కు కల్పనకోసం జిల్లాలలో చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాల వల్ల 692 మంది ఓటుహక్కు పొందారని తెలిపారు. మారుమూలప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఓటుహక్కు పొందేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అశ్వారావుపేట మండలానికి చెందిన కొండరెడ్లు ప్రదర్శించిన గిరిజన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి త్రినాధ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.