పార్ట్ టైం అధ్యాపకులుగా పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం, మణుగూరు
మణుగూరు మండలం మిట్టగూడెంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పార్ట్ టైం అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ ఓ ప్రకటనలోతెలిపారు. ఫిజిక్స్, బాటనీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో ఒక్కొక్కటి చొప్పున అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు ఆసక్తి, అర్హత కలిగిన వారంతా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీలో 55శాతం ఉత్తీర్ణత కలిగి, సెట్, నెట్, పీహెచ్డీ అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. అర్హులు డెమో క్లాసు కోసం ఈనెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరుకావాలని, దరఖాస్తులు, ధ్రువీకరణపత్రాల జిరాక్స్ కాపీలు, ఫొటోలు తీసుకురావాలని, ఇతర వివరాలకు 7901097698, 9550406691 సెల్ ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని పీఓ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు.