నకిరిపేట పంచాయతీలో 100 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక
పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వవిప్ రేగా కాంతారావు
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరిపేట పంచాయతీకి చెందిన దాదాపు 100 కుటుంబాలు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఆదివారం లక్ష్మీపురం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వారికి పార్టీకండువాలు కప్పి చేర్చుకున్నారు. సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన తాము బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు ప్రకటించారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, గ్రామ పెద్దలు పేరం బాలిరెడ్డి, సారపాకకు చెందిన నాయకులు, బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు ఎల్లంకి లలిత, కోయగూడెం సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి, మండల నాయకులు చెక్కపల్లి బాలాజీ,తదితరులు, సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామకమిటీ అధ్యక్షులు, యూత్, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.