జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షకు అనూహ్య స్పందన
✍🏽 దివిటీ మీడియా – సారపాక
సారపాకలో బ్రిలియంట్ నవోదయ కోచింగ్ ఆధ్వర్యంలో ఆదివారం బ్రిలియంట్ విద్యా సంస్థలో నిర్వహించిన జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షకు మంచి స్పందన లభించింది. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు 60 మందికిపైగా పరీక్షకు హాజరై తమ ప్రతిభను చాటుకున్నారని నవోదయ కోచింగ్ చైర్మన్ బి నాగేశ్వరరావు తెలిపారు. మారుమూల ఏజెన్సీప్రాంతంలో చదువుకునే విద్యార్థుల కోసం పరీక్షపై అవగాహన కల్పించి, వారిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నవోదయ మోడల్ పరీక్ష నిర్వహించామన్నారు. ప్రస్తుత పోటీప్రపంచంలో విద్యార్థులు క్రమ శిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచిపేరు తేవాలని ఆయన కోరారు. ఈ మోడల్ పరీక్ష ఫలితాలు ఈనెల 8వ తేదీన వెల్లడిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.