ఐటీసీ-ప్రథమ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు, భద్రాచలం
భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లోని 20 ప్రభుత్వపాఠశాలల ఉపాధ్యాయులకు ఇ- ఎడ్యుకేషన్ (కంప్యూటర్ విద్యాబోధన)పై శనివారం బూర్గంపాడు, భద్రాచలంలలో అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్య నేర్పించడమే లక్యంగా ప్రథమ్ ఇన్ఫోటెక్ ఫౌండేషన్, ఎస్ఏపీ, ఐటీసీ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విద్యా బోధన చేసే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 గురించి కూడా అవగాహన కల్పించారు. 20ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి, కంప్యూటర్ విద్య విద్యార్థులకందించే ఏర్పాట్లు చేసిన ప్రథమ్ ఇన్ఫోటెక్, ఎస్ఏపీ, ఐటీసీ సంస్థలకు ప్రధానోపాధ్యాయులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఆపరేషనల్ లీడర్ లోకరాజు ప్రోగ్రాం కోఆర్డినేటర్ నవీన్, టీం లీడర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.