బ్రిలియంట్స్ లో అక్టోబరు 1న జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్ష
✍🏽 దివిటీ మీడియా – సారపాక
నవోదయలో 18సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం సీట్లు సాధిస్తున్న బ్రిలియంట్ నవోదయ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ అక్టోబరు 1వ తేదీన నవోదయ మోడల్ పరీక్ష నిర్వహించనున్నారు. 2023-2024 విద్యాసంవత్సరంలో జరగనున్న నవోదయ మెయిన్ పరీక్ష రాయబోయే విద్యార్థులకు పరీక్షపై అవగాహన కల్పించేందుకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు బ్రిలియంట్ విద్యాసంస్థల అధిపతి బి.నాగేశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబరు 1వ తేదీ(ఆదివారం) ఉదయం 9:30గంటలకు సారపాకలోని బ్రిలియంట్ స్కూలులో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మెంటల్ ఎబిలిటీ, మాథ్స్, లాంగ్వేజ్ సబ్జెక్టులపై ఉండే మోడల్ పరీక్ష రాసే ఈ అవకాశం ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి చదివే విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో నిర్వహిస్తున్న పరీక్ష లో మొదటి రెండు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తామని ఆయన తెలియజేశారు. నవోదయ మోడల్ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులంతా ఒక్క రోజు ముందుగా తమ పేర్లను బ్రిలియంట్ స్కూలులో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకోసం సారపాకలోని బ్రిలియంట్ స్కూల్ సెల్ 9866283566, 7675040619 నెంబర్లలో సంప్రదించాలని నాగేశ్వరరావు కోరారు.