Divitimedia
Bhadradri KothagudemLife StyleTelanganaWomen

తెలంగాణ మహిళల చైతన్యం, వీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ పోరాటం

తెలంగాణ మహిళల చైతన్యం, వీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ పోరాటం

ఘనంగా నివాళులర్పించిన ఎస్పీ డా.వినీత్

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

తెలంగాణ మహిళల చైతన్యం, వీరత్వానికి ప్రతీకగా వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నిలిచిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్ అన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ, తెలంగాణ పోరాట యోధురాలు ఐలమ్మ సబ్బండ వర్గాలకు, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచారని, పేదల తరపున పెత్తందారులతో పోరాడిన ఐలమ్మ, తెలంగాణ మహిళల వీరత్వానికి నిదర్శనమని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ఆమె భూస్వాములు,రజాకార్లను ఎదిరిస్తూ, పోరాడటంతోపాటు పీడిత ప్రజలను ఏకం చేసిన ధీర వనిత అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి తెలంగాణ సాధనకు తోడ్పాటును అందించిందని, ఆమె ఆశయాలు నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇలాంటి ఎందరో తెలంగాణ పోరాట యోధులను ప్రత్యేకమైన రాష్ట్రం సాధించడం ద్వారానే స్మరించుకోవడం జరుగుతుందని, నాటి పోరాట యోధుల చరిత్రను నేటి తరం మరవకూడదని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) ఇ.విజయ్ బాబు, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, సైబర్ క్రైమ్స్ డీఎస్పీ కృష్ణయ్య, ఏఓ జయరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు నాగరాజు, రాజువర్మ, ఆర్ఐలు రవి, సుధాకర్, నరసింహరావు, డీసీఆర్బీ, ఐటీ, ఎస్బీ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


* జిల్లా గ్రంధాలయ సంస్థలో ఐలమ్మ జయంతి *

కొత్తగూడెంలోని జిల్లా గ్రంధాలయ సంస్థలో మంగళవారం చైర్మన్ దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథపాలకురాలు మణిమృదుల, సిబ్బంది, పాఠకులు, విద్యార్థినీ విద్యార్థులు మునీర్, శివ, నవీన్, జయరాం, తదితరులు కూడా పాల్గొన్నారు.
**
బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో…


చాకలి ఐలమ్మ జయంతిని బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆ శాఖ జిల్లాఅధికారి ఇందిర పాల్గొని, ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాడిన మహనీయుల చరిత్రను నేటితరాలకు తెలియ చేసేందుకు జయంతి, వర్ధంతి వేడుకలు అధికారికంగా ప్రభుత్వమే నిర్వహిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో రజకసంఘం జిల్లా కార్యదర్శి ముసలయ్య, రాష్ట్ర జేఏసీ యూత్ ప్రెసిడెంట్ పోగుల లక్ష్మినారాయణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కోదుమూరి సత్యనారాయణ, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు ముదురుకోళ్ల కిషోర్, బండి రాజుగౌడ్, ఎ సరోజ, రాచర్ల వెంకటయ్య, అంజయ్య, బీరెల్లి వీరభద్రం, ఆర్ సర్వేశ్వరరావు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

మాదకద్రవ్యాలతో నష్టంపై అవగాహన కల్పించాలి

Divitimedia

ప్రతిభావంతులకు మెరిట్ స్కాలర్ షిప్పులు

Divitimedia

ఐసీడీఎస్ లో అధికారుల అడ్డగోలు ‘దోపిడీ’

Divitimedia

Leave a Comment