సారపాకలో చిన్నారులకు ‘ఆధ్యాత్మిక పరీక్ష’
✍🏽 దివిటీ మీడియా – సారపాక
బూర్గంపాడు మండలం సారపాకలోని శ్రీరాంపురం, తాళ్లగొమ్మూరు కాలనీలలో వినాయకుని మండపాల దగ్గర 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలకు సోమవారం పరశురాం పరివార్ హిందూ సంస్థ ఆధ్వర్యంలో ”ఆధ్యాత్మిక పరీక్ష” నిర్వహించారు. పురాణాలు రామాయణం, మహాభారతం, వినాయకుని గురించి కొన్ని ప్రశ్నలతో కూడిన పరీక్ష నిర్వహించి, బాగా రాసిన వారికి మొదటి, రెండవ, మూడవ బహుమతితోపాటు, పరీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరశురాం పరివార్ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముత్తవరపు రాజశేఖర్ మాట్లాడుతూ పిల్లల్లో పురాణాల మీద ఎంత ప్రతిభ ఉందో తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అవగాహన లేనివారు కూడా పురాణాల గురించి తెలుసుకుంటారనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, సంస్కృతి, సాంప్రదాయాలు మరుగున పడకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పిల్లలకు పురాణాల గురించి అవగాహన కలిగించే బాధ్యత తల్లి దండ్రులపై ఉందని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక పరీక్షలో ఇతర మతాలకు చెందిన పిల్లలు కూడా పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచారని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి సాయికిరణ్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, బిజ్జం అశోక్ రెడ్డి, రాఘవ, అనిల్, విజయ్, యోగానందరెడ్డి, శ్రీరాంపురం, సారపాక, తాళ్లగొమ్మూరు వినాయక ఉత్సవ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.