ఉదయనిధిస్టాలిన్ కు సుప్రీంకోర్టు నోటీసులు
✍🏽 దివిటీ మీడియా – న్యూఢిల్లీ
‘సనాతన ధర్మం’ వ్యతిరేక వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వంతోపాటు డీఎంకే యువనాయకుడు ఉదయనిధిస్టాలిన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అతనితోపాటు ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీ ఎ రాజా, ఎంపీ తిరుమావళవన్, ఎంపీ సు వెంకటేశన్, తమిళనాడు డీజీపీ, గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు, తమిళనాడు రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్ పర్సన్ పీటర్ అల్ఫోన్స్ కు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.