తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా బక్కి వెంకటయ్య నియామకం
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఆ వివరాలను గురువారం సాయంత్రం సీఎం కార్యాలయం విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం… రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా బక్కి వెంకటయ్య (ఎస్సీ, మెదక్) ను ముఖ్యమంత్రి నియమించారు. కమిషన్ సభ్యులుగా కుస్రం నీలాదేవి (ఎస్టీ, ఆదిలాబాద్), రాంబాబునాయక్ (ఎస్టీ, దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ (ఎస్సీ, కరీంనగర్), జిల్లా శంకర్ (ఎస్సీ, నల్లగొండ జిల్లా), రేణికుంట ప్రవీణ్ (ఎస్సీ, ఆదిలాబాద్)లను సీఎం నియమించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన కార్యాలయం నుంచి విడుదల చేసిన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.