శరవేగంగా ‘కాలం రాసిన కథలు’ షూటింగ్
మచిలీపట్నం, పెడన పరిసరాల్లో సాగుతున్న చివరి షెడ్యూల్ షూటింగ్
✍🏽 దివిటీ మీడియా – సినిమా విభాగం
ఎమ్ ఎన్ వి సాగర్ స్వీయ దర్శకత్వంలో
భోళశంకరుడు శివుడు ప్రధానాంశంగా సాగే
‘కాలం రాసిన కధలు’ చిత్రం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ మచిలీపట్నం, పెడన పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా విడుదల అయిన మూడు లిరికల్ పాటలకు విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ఊహలకందని ‘ట్విస్ట్’ లతో అలరిస్తూనే కుటుంబ నైతిక విలువలు తెలియజేస్తుందని సమాచారం. ప్రస్తుతం హీరో హీరోయిన్లు వికాస్, విహారికచౌదరిపై
’50 కేజీస్ తాజ్మహల్’ అనే సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఆపాటని అక్టోబరులో ‘గ్రాండ్’ గా హైదరాబాదులో రిలీజ్ చేస్తామని, ఒకే సినిమాలో ఎక్కువ కథలతో రూపొందుతూ ఉన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని దర్శక నిర్మాత తెలిపారు.
ప్రస్తుత షెడ్యూల్లో వికాస్, విహారిక చౌదరి రోహిత్ కొండ, అభిలాష్ గోగుబోయిన, తదితర ప్రధానపాత్రల నటులు షూటింగ్లో పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని నవంబరులో కానీ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నామని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయని దర్శకుడు, నిర్మాత ఎమ్.ఎన్.వి సాగర్ తెలియజేశారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, నిర్మాత – ఎం.ఎన్.వి సాగర్,
మ్యూజిక్ డైరెక్టర్- మెరుగు అర్మాన్,
సినిమాటోగ్రఫీ-ప్రసాద్, లిరిక్స్-శ్రీనివాస్ తమ్మిశెట్టి, జి.రాజ్ కుమార్, ఎడిటింగ్- మహేష్ మేకల, పబ్లిసిటీ డిజైనింగ్- ఎంకేఎస్ మనోజ్, విఎఫ్ఎక్స్- కిషోర్ కుమార్, పిఆర్ఓ- బి.వీరబాబు.