Divitimedia
Andhra PradeshHyderabadLife StyleNational NewsTelangana

హైదరాబాదు-బెంగళూరు మధ్య వందేభారత్

హైదరాబాదు-బెంగళూరు మధ్య వందేభారత్

ఈనెల 24నుంచి పరుగులు పెట్టనున్న రైలు

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు

ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ‘వందేభారత్ రైలు’ ఈనెల 24నుంచి రెండు  దక్షిణాది రాష్ట్రాల రాజధాని నగరాల మధ్య పరుగులు పెట్టనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్, కర్ణాటక రాజధాని బెంగళూరు  నడుమ ఈ మేరకు గురువారం ట్రయల్ రన్  చేస్తున్నారు. ఈ రైలును దేశ ప్రధానమంత్రి  నరేంద్రమోదీ సెప్టెంబర్ 24న వర్చువల్ గా ప్రారంభించనున్నారు. హైదరాబాదు నుంచి బెంగుళూరు మధ్య మొత్తం 610కిలోమీటర్ల దూరాన్ని 8-30గంటల్లో ప్రయాణించనుంది. సగటున 71కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే ఈ రైలు హైదరాబాదులోని కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 5-30గంటల నుంచి  ప్రారంభమై మధ్యాహ్నం 2గంటల లోపున యశ్వంత్ పూర్ స్టేషన్ చేరుతుంది. మరలా మధ్యాహ్నం 2-45గంటలకు బెంగళూరులో బయలుదేరి రాత్రి 11-15 గంటలకు హైదరాబాదు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులు నడుస్తుందని వివరించారు. హైదరాబాదు- బెంగళూరు నడుమ మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురము, డోన్, ధర్మవరం స్టేషన్లలో మాత్రమే ఈ వందేభారత్ రైలుకు స్టాప్ ఉంటుంది. మొత్తం 16 బోగీలు ఉండే ఈ రైలు నిర్వహణ బాధ్యత కాచిగూడలో దక్షిణమధ్య రైల్వే అధికారులు చూస్తారు.  ప్రస్తుతానికి ఈ  రెండు రాష్ట్రాల రాజధాని నగరాల నడుమ సూపర్ ఫాస్ట్, రాజధాని, మెయిల్ ఎక్స్ ప్రెస్, వంటి మొత్తం 20 రైలు సర్వీసులున్నాయి. రెండు నగరాల మధ్య  సగటు ప్రయాణసమయం 12 గంటలని, ఈ  వందేభారత్ వల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుందని దక్షిణమధ్య రైల్వే (ఎస్సీఆర్) అధికారులు తెలిపారు.

Related posts

‘సఖి’ వన్ స్టాప్ సెంటర్ నూతన భవనం ప్రారంభం

Divitimedia

మాదకద్రవ్యాలతో నష్టంపై అవగాహన కల్పించాలి

Divitimedia

నిద్రపోయి’… నిండా ‘ముంచారు’…

Divitimedia

Leave a Comment