Divitimedia
Bhadradri KothagudemHyderabadTelangana

జీఓ.59 ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేస్తాం : కలెక్టర్ డా ప్రియాంకఅల

జీఓ.59 ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేస్తాం : కలెక్టర్ డా ప్రియాంకఅల

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జీఓ.59 ప్రక్రియ 15 రోజుల్లో పూర్తిచేస్తామని జిల్లా కలెక్టర్ డా ప్రియాంకఅల తెలిపారు. హైదరాబాద్ నుంచి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి పంట రుణాలు మాఫీ, కొత్త రుణాల మంజూరు, ఎరువుల సరఫరా, జీఓ.58, 59, గృహాలక్ష్మి, ఆసరా పింఛన్లు, సోషల్ వెల్ఫేర్ ఇంటిపట్టాలు, తెలంగాణకు హరితహారం, పంచాయతీ భవనాల నిర్మాణం, ఆయిల్ పామ్ సాగు, తదితర అంశాలపై జిల్లాకలెక్టర్లతో జరిపిన వీడియోకాన్ఫరెన్సులో కలెక్టర్ ఐడీఓసీ మినీ సమావేశమందిరం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ, నిర్దేశిత పలు అంశాలపై జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ప్రియాంకఅల మాట్లాడుతూ, బ్యాంకర్ల వద్ద గ్రామాలవారీగా పంట రుణమాఫీ వివరాలు సేకరించి, వ్యవసాయ విస్తరణ అధికారుల సమన్వయంతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా కొత్త రుణాలు కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులందరికీ పంటరుణ మాఫీ జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. అక్టోబర్ నెలాఖరు నాటికల్లా కేటాయించిన మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా ప్రత్యేకంగా కార్యాచరణ అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతినెలా లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటిని సాధించే దిశగా కృషి చేస్తామని కలెక్టర్ వివరించారు. రైతులకు సకాలంలో ఎరువులు లభించేవిధంగా కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. 15 రోజుల్లోగా ప్రభుత్వ జీఓ.59 కి సంబంధించి అర్హులందరికీ భూమిపట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. గృహ లక్ష్మి పథకానికి సంబంధించి, భద్రాద్రిజిల్లాకు కేటాయించిన ఇళ్లకు లబ్దిదారులను త్వరిత గతిన ఎంపికచేసి, రెండువారాల్లో మంజూరీ పత్రాల పంపిణీ పూర్తిచేయాలని కలెక్టర్లకు సీఎస్ తెలిపారు. పెండింగులో ఉన్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, డిసెంబర్ నాటికి ప్రతి గ్రామపంచాయతీలకు భవనాల నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా అటవీ అధికారి కిష్టాగౌడ్, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, డీఆర్ఓ రవీంద్రనాధ్, ఉద్యాన అధికారి మరియన్న, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఎల్డీఎం రామిరెడ్డి, ఆర్డీఓలు శిరీష, మంగిలాల్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

డీఎస్సీ పరీక్షకేంద్రం వద్ద సెక్షన్ 163 సెక్షన్

Divitimedia

పాలేరులో నామినేషన్ దాఖలు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Divitimedia

మునగసాగు రైతుల పాలిట వరం

Divitimedia

Leave a Comment