Divitimedia
Bhadradri KothagudemLife StyleTelanganaYouth

అక్కాతమ్ముళ్లకు నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం

అక్కాతమ్ముళ్లకు నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మోరంపల్లిబంజర్ గ్రామానికి చెందిన అక్కాతమ్ముళ్లకు పైచదువుల కోసం గ్రామానికి చెందిన నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థికసాయం అందించింది. గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అక్క తమ్ముడు ఏడాకుల ఝాన్సీ, ప్రేమ్ సాయిరెడ్డిలకు పై చదువులకోసం మంగళవారం సాయంత్రం రూ 30,000 అందించారు. ఏడాకుల బాబు రెడ్డి, పద్మ దంపతుల సంతానమైన ఝాన్సీ, డిగ్రీ ద్వితీయ సంవత్సరం, ప్రేమ్ సాయిరెడ్డి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ చదువుల్లో ముందున్నారు. పేదకుటుంబం అయినప్పటికీ ఆ దంపతులు కూలీపనులు చేస్తూ ఇద్దరినీ చదివిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వారి తల్లి పద్మ డెంగ్యూ జ్వరంతో మరణించడం, డిస్క్ సమస్యతో ఆపరేషన్ చేయాల్సినంతగా బాధపడుతున్న తండ్రి బాబురెడ్డి దుస్థితి కారణంగా ఇద్దరి చదువు ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితుల్లో వారి చదువుకు సాయం చేయాలని నిర్ణయించిన నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సాయం చేశారు. ఈ సందర్బంగా ట్రస్ట్ ఛైర్మెన్ బత్తుల రామ కొండారెడ్డి మాట్లాడుతూ, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. పేదవారికి విద్య, వైద్యం కోసం సహాయం చేయడానికి తమ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ చింతా అంకిరెడ్డి, ట్రజరర్ ఇండ్ల వెంకటరాజేష్, ట్రస్ట్ సభ్యులు, బత్తుల రామకొండారెడ్డి (సొసైటీ డైరెక్టర్), ఆవుల శివనాగిరెడ్డి, రామిరెడ్డి, బాలనారాయణరెడ్డి, మల్లీశ్వరి, సౌజన్య, మహేష్ రెడ్డి, కొండారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

వైద్య విద్యలో పేరు ప్రఖ్యాతులు సాధించాలి

Divitimedia

బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి కుటుంబం

Divitimedia

కాగితాలకే పరిమితమవుతున్న ఐసీడీఎస్ కార్యక్రమాలు

Divitimedia

Leave a Comment