Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot News

అంగన్ వాడీ కేంద్రాలు ఓపెన్ చేయకపోతే పర్యవేక్షకులపై కఠిన చర్యలు

అంగన్ వాడీ కేంద్రాలు ఓపెన్ చేయకపోతే పర్యవేక్షకులపై కఠిన చర్యలు

ఆకస్మిక తనిఖీలో హెచ్చరించిన జిల్లా కలెక్టర్ డా.ప్రియాంకఅల

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం

అంగన్ వాడీ సిబ్బంది సమ్మె చేస్తుంటే, ఆ అంగన్ వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి, లబ్ధిదారులకు పౌష్టికాహారం కోసం సరకులు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే సీడీపీఓలు, సూపర్ వైజర్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా. ప్రియాంకఅల హెచ్చరించారు. పాతకొత్తగూడెంలో అంగన్ వాడీ కేంద్రాన్ని గురువారం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్, కేంద్రం మూసివేసి తాళాలు వేసి ఉండటం పట్ల అసంతృప్తితో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జిల్లాలో అన్ని మండలాల్లో అంగన్వాడీ కేంద్రాలు నడుస్తుంటే మీ దగ్గర ఎందుకు నడవడంలేదని ప్రశ్నించిన కలెక్టర్, వెంటనే ఆ కేంద్రం ఓపెన్ చేయండని’ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల మహిళా, శిశు సంక్షేమ అధికారులను ఆదేశించారు. తాళం వేసి ఉన్న అంగన్ వాడీ కేంద్రం వద్ద కలెక్టర్, సిడిపిఓ వచ్చేంతవరకు వేచిఉన్నారు. అన్ని మండలాల్లో కేంద్రాలు పనిచేస్తుంటే కేవలం మీ దగ్గరే ఎందుకు పనిచేయడం లేదంటూ సిడిపిఓ లెనినాను జిల్లాకలెక్టర్ ప్రశ్నించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఏమీ ఇబ్బంది రాకుండా అంగన్ వాడీ కేంద్రాలలో పోషకాహారం అందించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తగూడెం ప్రాజెక్టు పరిధిలో 214 కేంద్రాలు ఉండగా 36 మాత్రమే నడుస్తున్నాయంటే, మిగిలినవి ఎందుకు నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళం ఎందుకని తీయలేదని ప్రశ్నించిన కలెక్టర్, ఆ తాళాలు లేవని సిడిపిఓ సమాధానం చెప్పడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తాళాలు తీయక పోతే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేంద్రం తాళాలు ఎందుకు తీయించలేదని అడిగితే, పొంతన లేని సమాధానాలెందుకు చెప్తున్నారంటూ, తాళాలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే కదా? అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ చేయకపోవడం కారణంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు టైం ప్రకారం ఇవ్వాల్సిన పోషకాలు అందకుండా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆ లబ్ధిదారులకు పోషకాహారం అందించడంలో ఇబ్బందిరాకుండా కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంటే, అలసత్వం ప్రదర్శిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్ వాడీ కేంద్రాలు తెరిపించని ప్రాజెక్టు సిడిపిఓలకు, సూపర్ వైజర్లకు వేతనాలు నిలిపేస్తానని హెచ్చరించారు. కొత్తగూడెంలో ఎన్నికేంద్రాలు నడుస్తున్నాయనే విషయం గురించి తనకు నివేదిక ఇవ్వాలని సంక్షేమ అధికారికి సూచించారు. ఆ కేంద్రంలో ఎంత మంది పిల్లలున్నారు? ఎంతమందికి రేషన్ ఇచ్చారు? స్టాకు ఎంత ఉందనే వివరాలపై సిడిపిఓను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆకస్మికతనిఖీలో మహిళా సంక్షేమ అధికారి విజేత, తహసిల్దారు పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్‌ స్టేషన్లు

Divitimedia

‘ముక్తార్ పాషా, పైలా చంద్రక్కల అమరత్వం మహోన్నతం’

Divitimedia

పాలేరులో నామినేషన్ దాఖలు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Divitimedia

Leave a Comment