Divitimedia
Bhadradri KothagudemEducationHealthTelanganaWomen

ఆరోగ్య మహిళాకేంద్రం ప్రారంభించిన కలెక్టర్

ఆరోగ్య మహిళాకేంద్రం ప్రారంభించిన కలెక్టర్

✍🏽 దివిటీ మీడియా – అశ్వాపురం

మహిళలు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నపుడే ఆరోగ్యవంతమైన సమసమాజం ఏర్పడు తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్. సి)లో మంగళవారం ఆమె ఆరోగ్య మహిళాకేంద్రం ప్రారంభించారు. మహిళల ఆరోగ్య రక్షణకు మొదటి దశలో మార్చి 8వ తేదీన జిల్లాలో ఐదు ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేసి, రెండవ విడత జిల్లాలో 9 మండలాల్లో కూడా ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలకుండే ఆరోగ్య సమస్యలను బయటికి చెప్పుకోలేక వారు ప్రమాదకర పరిస్థితులకు గురవుతున్నారని గమనించిన ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. ఈ కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళా వైద్యులే ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కేంద్రాల్లో కిశోర బాలికల నుంచి వయోవృద్ధుల వరకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి పరీక్షలతో పాటు ధైరాయిడ్, బిపి, రక్తహీనత, తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తారని ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు. టి-హబ్ ద్వారా 134రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్న విషయం గుర్తించి, మహిళలంతా ఏ జాప్యం చేయకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పారు. అశ్వాపురం మండలంలో 40వేల మంది మహిళలుంటే, వారిలో 7వేల మందికి ఇంకా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రాధమిక దశ స్థాయిలోనే ఏ వ్యాధినైనా గుర్తించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందని, ఏ మాత్రం ఆరోగ్యం సరిగా లేకపోయినా సమీపంలోని ఆరోగ్య మహిళా కేంద్రానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ జరిగితే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులతో పాటు హైదరాబాదులోని ఆసుపత్రుల్లో వైద్య సేవలందించనున్నట్లు చెప్పారు. ఈ ఆరోగ్య కేంద్రాలు మహిళలకు చాలా ఉపయోగకరమని, అందుకే ఎలాంటి అడ్డంకులు, మొహమాటాలు పడకుండా నిరభ్యంతరంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. మహిళా ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే వైద్య సేవలపై గ్రామాలు, పట్టణాలలో ప్రతి ఒక్కరికి తెలియచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. అశ్వాపురం మండలంలో పర్యటించిన సందర్భంగా కలెక్టర్ ప్రియాంక సీతారాంపురం ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసి, అక్కడ జరుగుతున్న మనఊరు- మన బడి పనుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోగా ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు సులక్షణ, ఎంపిపి సుజాత, సర్పంచ్ శారద, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, జిల్లా ఉపాధికల్పనాధికారి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి విజేత, ఉప వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్, వైద్యాధికారి డాక్టర్ సంకీర్తన, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆదిలక్ష్మి రూపంలో అమ్మవారు…

Divitimedia

నిరుపేద మహిళలకు గొడుగుల పంపిణీ

Divitimedia

ముంపు బాధిత గ్రామాలను కాపాడాలని ధర్నా

Divitimedia

Leave a Comment