ఐటీడీఏ పీఓను కలిసిన పద్మశ్రీ రామచంద్రయ్య
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
ప్రముఖ డోలీ కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత సకినం రామచంద్రయ్య శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన పీఓకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు తీసుకున్న సకినం రామచంద్రయ్యను అభినందించిన ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు అంతరించకుండా, వాటిని కాపాడుకుంటూ పద్మశ్రీ అవార్డు పొందడం చాలా సంతోషకరమన్నారు. కళలను నేటి తరానికి అందించాలని, గిరిజన సంస్కృతి కాపాడాలని, తప్పకుండా ఆయన సేవలను నేటితరానికి అందించే విధంగా సహకారం అందించి కృషిచేస్తామన్నారు.కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మణెమ్మ, ట్రైబల్ మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి, తదితరులు కూడా పాల్గొన్నారు.