ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
బూర్గంపాడులోని శ్రీ సీతారామంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. గ్రామంలో శ్రీకృష్ణ యాదవ్ యూత్ సభ్యులు దేవాలయంలో నిర్వహించిన ‘ఉట్లుకొట్టే’ ఉత్సవంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో భక్తులు కూడా అధికసంఖ్యలో పాల్గొన్నారు. గోవిందా గోవిందా అంటూ దైవనామస్మరణతో ప్రదేశమంతా దద్దరిల్లి పోయింది. ఈ కార్యక్రమంలో దేవాలయం అర్చకులు, పాలకమండలి సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.