Divitimedia
Bhadradri KothagudemEducationKhammamMahabubabadTelangana

ఎస్సీఅర్పీలు మరింత బాధ్యతగా పని చేయాలి

ఎస్సీఅర్పీలు మరింత బాధ్యతగా పని చేయాలి

గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ మణెమ్మ

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జిపిఎస్ పాఠశాలల నిర్వహణ మరింత బాధ్యతగా తీసుకోవాలని, గిరిజన చిన్నారుల భవిష్యత్తు బాగుపడే విధంగా సంబంధిత ఎస్సీఆర్పీలు శ్రద్ధ వహించాలని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్(డిడి) మణెమ్మ ఆదేశించారు. ఐటీడీఏ పీఎంఆర్సీ సమావేశమందిరంలో ఐటీడీఏ పీఓ ప్రతిక్ జైన్ ఆదేశాల మేరకు, జీపీఎస్ పాఠశాలల నిర్వహణ, విద్యాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై ఎస్సీఆర్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్సీఆర్పీలకు సూచనలు ఇస్తూ ఎస్సీఆర్పీల పరిధిలో ఉన్న జీపీఎస్ పాఠశాలలను ఎస్సీఆర్పీలు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఎస్టీ చిన్నారులకు ఇబ్బందులేమైనా ఉన్నాయా, లేవా అనేది సంబంధిత ఉపాధ్యాయుడిని గానీ పిల్లల్ని గానీ అడిగి తెలుసుకోవాలని, ఏమైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. వర్షాకాలం నడుస్తున్నందున పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాఠశాలల్లో స్వచ్ఛమైన మంచినీరు, కరెంట్ సౌకర్యం తప్పనిసరిగా ఉండేలా చూడాలని, పిల్లలకు సమయానుకూలంగా అల్పాహారం, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో?, లేదో? గమనించాలని ఆదేశించారు. ముఖ్యంగా పిల్లల చదువుపై మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించి, పాఠశాల ఆవరణలో పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలని, చెత్తాచెదారం ఏమీలేకుండా ఎప్పటికప్పుడు తొలగించి, పాఠశాల పైన నిలువ నీరు ఉండకుండా చూడాలని అన్నారు. పిల్లలకు సాధనబుక్స్, స్టడీ మెటీరియల్ కూడా అందించామని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ రమణయ్య, ఏటీడీఓ నరసింహారావు, జీసీడీఓ అలివేలు మంగతాయారు, ఎస్సీఆర్పీలు పాల్గొన్నారు.


ఐటీడీఏ పీఓను కలిసిన ఏటీడీఓ


మల్టీ జోనల్ అధికారిగా ఉన్న ఐటీడీఏ పీఓ ప్రతిక్ జైన్ ను మంగళవారం ఆయన కార్యాలయంలో మహబూబాబాద్ ఏటీడీఓ సత్యవతి మర్యాదపూర్వకంగా కలిశారు. పీఓకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలోని గిరిజనసంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పీఓ ఆమెకు సూచించారు.

Related posts

రెండు భారీ పరిశ్రమల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు

Divitimedia

డీఎస్సీ పరీక్షకేంద్రం వద్ద సెక్షన్ 163 సెక్షన్

Divitimedia

ప్రభుత్వవిప్ శ్రీనివాస్ ను కలిసిన కార్మికనాయకులు

Divitimedia

Leave a Comment