వీఆర్ఏలకు ‘మిషన్ భగీరథ సహాయకులు’గా శిక్షణ
✍🏽 దివిటీ మీడియా – పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెంలోని నీటి శుద్ధి కేంద్రం (వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్)లో రెవెన్యూ శాఖ నుంచి బదిలీపై వచ్చి విధుల్లో చేరిన వీఆర్ఏలకు “మిషన్ భగీరథ విభాగంలో సహాయకులు”గా పనిచేసే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరికి మిషన్ భగీరథలో నిర్వహించాల్సిన విధులు, నీటిని శుద్దిచేసే ప్రక్రియ, వాటర్ ట్యాంక్ కి బ్లీచింగ్ చేసే విధానాల గురించి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సి.ఇ వి. శ్రీనివాస్, ఎస్.ఇ ఇ.సదాశివ కుమార్, ఇ.ఇ లు ఎన్ తిరుమలేష్, సి నళిని, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా విభాగాల నుంచి డి.ఇ లు, ఎ.ఇ లు, నీటి నాణ్యత ప్రయోగశాల కన్సల్టెంట్, లాబ్ సిబ్బంది పాల్గొన్నారు.