కొత్తగూడెంలో ‘ఐ ఓట్ ఫర్ ష్యూర్’ 5కె రన్
ఓటుహక్కు వినియోగం అందరి బాధ్యతన్న అధికారులు
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
ఓటుహక్కు వినియోగం, ఆవశ్యకత, ఓటరు నమోదు, తదితర అంశాలపై జిల్లా కేంద్రం కొత్తగూడెంలో శనివారం “ఐ ఓట్ ఫర్ ష్యూర్(నేను కచ్చితంగా ఓట్ వేస్తాను)’ అనే నినాదంతో 5కె రన్ నిర్వహించారు. ఈ రన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్ జెండా ఊపి ప్రారంభించగా, స్థానిక పోస్టాఫీస్ సెంటర్ నుంచి లక్ష్మిదేవిపల్లిలోని సెంట్రల్ పార్కు వరకు నిర్వహించారు. నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను, ఓటు హక్కును వినియోగించుకోవడం నా వంతు బాధ్యత’ అనే భావనతో ఓటరుగా నమోదైనవారంతా తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా అధికారులు కోరారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం జిల్లా పరిధిలోని అయిదు నియోజకవర్గకేంద్రాల్లో ‘ఓట్ ఫర్ ష్యూర్’అనే అంశాలపై 5కె రన్ నిర్వహించారు. ఈ 5కె రన్ కార్యక్రమంలో ప్రజలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రన్ లో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆర్ అండ్ బి ఈఈ భీమ్లా, ఆడిట్ అధికారి వెంకటరెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న, సహకార అధికారి వెంకటేశ్వర్లు, ఎల్డీఎం రాంరెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణి, క్రీడల అధికారి పరంధామరెడ్డి, సిపిఓ శ్రీనివాసరావు, తూనికలు కొలతల అధికారి మనోహర్, మైనింగ్ అధికారి జైసింగ్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి సబిత, ఆర్డీఓ శిరీష, తదితరులు పాల్గొన్నారు.