Divitimedia
Bhadradri KothagudemEducationHealthTelangana

పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఎదగాలి

పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఎదగాలి

విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉద్భోధించిన డాక్టర్ మౌనిక

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

పిల్లలు పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండి బాగా చదివి తల్లిదండ్రులకు, పుట్టిన గ్రామానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సోంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు డాక్టర్ మౌనిక సూచనలు చేశారు. శనివారం ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’ కు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మౌనిక మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని పాఠశాల, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ జాజి వెంకటరమణయ్య, స్కూల్ డెవలప్ మెంట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రావు, పాఠశాల ఉపాధ్యాయులు సైదులు, రవి, బిచ్చ, తిరుపతమ్మ, గ్రామ యూత్ కమిటీ చైర్మన్ సంతోష్, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related posts

కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Divitimedia

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ

Divitimedia

‘ఆరోగ్య బీమా’ కేసులో వినియోగదారుని విజయం

Divitimedia

Leave a Comment