భద్రాచలం ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన మంగీలాల్
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
భద్రాచలం రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీఓ)గా నియమితులైన మాలోత్ మంగీలాల్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు శ్రీ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ విభాగంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్.డి.సి)గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆర్డీఓగా పదోన్నతిపై భద్రాచలంలో బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం భద్రాచలం పట్టణంలో ఉన్న 41 పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన వాటిని పరిశీలించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్నందున వికలాంగులు, వృద్ధులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా వికలాంగుల కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంపులు ఏర్పాటు చేయాలని, అన్నిచోట్ల విద్యుత్తు సరఫరా, మంచినీటికి సౌకర్యం, మెడికల్ క్యాంపులు ఏర్పాటుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎలక్షన్ డిటి రమేష్, తదితరులు కూడా పాల్గొన్నారు.