Divitimedia
Bhadradri KothagudemEducationTelanganaWomen

హాస్టల్లో అపరిశుభ్రత, అసౌకర్యాలపై కలెక్టర్ ఆగ్రహం

హాస్టల్లో అపరిశుభ్రత, అసౌకర్యాలపై కలెక్టర్ ఆగ్రహం

ప్రిన్సిపల్, వార్డెన్లకు షోకాజ్ నోటీసుల జారీకి ఆదేశాలు

మార్పు రాకుంటే సస్పెండ్ చేస్తానని హెచ్చరించిన కలెక్టర్

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

పాల్వంచ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే వసతిగృహాన్ని ఆకస్మికంగా గురువారం తనిఖీ చేసిన జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంక, ప్రిన్సిపల్, వార్డెన్ల పనితీరు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతిగృహం పరిసరాల్లో అపరిశుభ్రత, విద్యుద్దీపాలు కూడా సరిగా లేవని గుర్తించిన ఆమె ఇంత
అపరిశుభ్రత ఉంటే విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని మళ్లీ తాను పరిశీలనకొస్తానని అప్పట్లోగా మార్పు రాకపోతే విధుల నుంచి సస్పెండ్ చేస్తానని కలెక్టర్ ప్రియాంక హెచ్చరించారు. వసతిగృహం నిర్వహణపై ఆర్సీఓ తో ఫోన్లో మాట్లాడిన ఆమె ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని, ఆర్సీఓపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిశుభ్రతకు మారు పేరుగా ఉండాలని, ఇంతగా అపరిశుభ్రత నెలకొని ఉంటే ఈ విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని ప్రశ్నించారు. విద్యార్థులు చదువుకోడానికి అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉండగా, ఇంతటి నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని నిలదీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని గమనించిన కలెక్టర్ ప్రిన్సిపల్, వార్డెన్ కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆర్సీఓను ఆదేశించారు. విద్యార్థుల హాజరు రిజిస్టరు పరిశీలించిన కలెక్టర్, సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అసౌకర్యాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్వంచ తహసిల్దార్ వినయశీల, తదితరులు పాల్గొన్నారు.

Related posts

‘ఏకలవ్య’లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి : ఐటీడీఏ పీఓ

Divitimedia

ఆహారం తీసుకునే ప్రతిసారి చేతులు శుభ్రపరచుకోవాలి

Divitimedia

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు

Divitimedia

Leave a Comment