Divitimedia
Bhadradri KothagudemLife StyleTelanganaWomen

దివ్యాంగుల స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

దివ్యాంగుల స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 14)

దివ్యాంగుల ఆర్థిక ప్రోత్సాహక పథకం (ఎకనామికల్ రిహాబిలిటేషన్ స్కీం) కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దివ్యాంగుల కోసం జీవనోపాధి అవకాశాలు కల్పించే విధంగా స్వయం ఉపాధి రుణాలు అంద జేస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యుఓ) స్వర్ణలతలెనినా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం కింద జిల్లాకు పూర్తి (100శాతం) రాయితీతో  రూ.50,000 చొప్పున 27 యూనిట్లు,  80శాతం రాయితీతో రూ.1లక్ష చొప్పున 1 యూనిట్, 60శాతం రాయితీతో రూ.3  లక్షల చొప్పున 1 యూనిట్  మంజూరు చేసినట్లు ఆమె వెల్లడించారు. అర్హులైన దివ్యాంగులు tgobmms.cgg.gov.in వెబ్ సైట్ లో ఈ నెల14వ తేది నుంచి 31వ తేది లోపు ఆన్లైన్ లో దరఖాస్తులు  చేసుకోవాలని స్వర్ణలతలెనినా కోరారు.
పూర్తి వివరాల కోసం 6301981960, 8331006010 నెంబర్లను సంప్రదించ వచ్చని ఆమె తెలిపారు.

Related posts

ఐటీడీఏ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష

Divitimedia

పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

Divitimedia

అటవీప్రాంతంలో విత్తనాలు చల్లిన విద్యార్థులు

Divitimedia

Leave a Comment