Divitimedia
Bhadradri KothagudemDELHIEducationHyderabadLife StyleMahabubabadNational NewsPoliticsSpot NewsTechnologyTelanganaYouth

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేయించండి

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేయించండి

✍️ భద్రాచలం – దివిటీ (జనవరి 2)

భద్రాచలం ప్రాంతంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భద్రాచలం మండల మాజీ అధ్యక్షుడుక సీనియర్ నాయకుడు తాండ్ర నర్సింహరావు, మహబూబాద్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ ను కోరారు. ఈ మేరకు ఎంపీని ఆయన స్వగృహంలో గురువారం కలసిన నర్సింహరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రాచలంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఉండేదని, ఆ కాలేజీ ద్వారా పేద, బడుగు, బలహీన, గిరిజన విద్యార్థుల ఉన్నతవిద్యకు బాటలు వేసేదని ఆయన వివరించారు. రాష్ట్ర విభజన వల్ల ఆ పాలిటెక్నిక్ కాలేజీ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలోకి వెళ్లడంతో భద్రాచలం ప్రాంతానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విద్య దూరమైందన్నారు. ఈ ప్రాంత విద్యార్థుల ఉన్నత చదువులకు బడుగు బలహీన గిరిజన విద్యార్థులకు, టెక్నికల్ విద్యని అందించాలని కోరారు. అందుకే తిరిగి భద్రాచలం ప్రాంతానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేయించే విధంగా కృషి చేయాలని తాండ్ర నరసింహారావు కోరారు. ఈ విషయంపై స్పందించిన ఎంపీ, సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కచ్చితంగా పరిష్క రించే విధంగా కృషిచేస్తానని తెలిపారు.

Related posts

అంతర్రాష్ట్ర ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడేనా…?

Divitimedia

సైబర్ నేరాలపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలి

Divitimedia

 తాగి బండి నడిపితే ఇంక అంతే సంగతులు

Diviti Media News

Leave a Comment