ఐదు మండలాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం
✍️ అశ్వారావుపేట – దివిటీ (నవంబరు 27)
ములకలపల్లి మండలం లోని రామచంద్రపురం గ్రామం దగ్గర సీతారామ ప్రాజెక్టు పైపులైను మళ్లింపు పనుల కారణంగా ఐదు మండలాల్లో మిషన్ భగీరథ పథకంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మిషన్ భగీరథ గ్రిడ్ విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్ (ఈఈ) సి.నళిని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలతో పాటు సత్తుపల్లి మండలానికి ఈనెల 28వ తేదీ నుంచి డిసెంబరు 1వరకు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. ఐదు మండలాల ప్రజలు దయచేసి సహకరించాలని కోరారు.