Divitimedia
Bhadradri KothagudemEducationHanamakondaHealthHyderabadKhammamLife StyleSportsSpot NewsTelanganaWomenYouth

టీటీ బాలబాలికల టీం ఛాంపియన్స్ హైదరాబాద్

ముగిసిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు

✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 4)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆనందఖని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన అండర్ -17 బాల బాలికల రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. టీం ఛాంపియన్షిప్, వ్యక్తిగత అంశాల్లో జరిగిన ఈ పోటీలలో తెలంగాణ రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. టీం ఛాంపియన్షిప్ విభాగంలో హైదరాబాద్ బాలబాలికల జట్లు అద్భుతమైన ప్రతిభ కనబరిచి టీం ఛాంపియన్లుగా నిలిచారు. ద్వితీయ స్థానంలో రంగారెడ్డి బాలబాలికల జట్లు నిలిచాయి. బాలికల టీం ఛాంపియన్షిప్ లో తృతీయస్థానాన్ని ఆతిథ్య ఖమ్మం జట్టు పొందగా, బాలుర విభాగంలో టీం ఛాంపియన్షిప్ లో నిజామాబాద్ జట్టు తృతీయ స్థానం సాధించింది. వ్యక్తిగత బాలుర సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ఆటగాళ్లు జతిన్ దేవ్ ప్రథమ స్థానం, తరుణ్ ద్వితీయస్థానం సాధించారు. తృతీయ స్థానాన్ని రంగారెడ్డికి చెందిన అరూష్ రెడ్డి సాధించాడు.
బాలికల వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ కు చెందిన శశిరిత ప్రధమ, శ్రేష్టారెడ్డి ద్వితీయ, చైత్రారెడ్డి తృతీయస్థానం సాధించారు. సోమవారం రాత్రి జరిగిన ముగింపు కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం.పరంధామరెడ్డి ముఖ్యఅతిథిగా, జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి విశిష్ట అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అంద జేశారు. కార్యక్రమంలో రాష్ట్రస్థాయి పోటీల పరిశీలకుడు మామిడి సంతోష్, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వాసిరెడ్డి నరేష్ కుమార్, పామర్తి శ్రీనివాస్, సుధీర్, మంజుల, సాంబమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
********
జాతీయ స్థాయికి ఎంపికైన బాల బాలికల వివరాలు
********

  • బాలుర విభాగంలో హైదరాబాద్ కు చెందిన జతిన్ దేవ్, తరుణ్, దేవాన్సుసింగ్, రిషబ్ సింగ్, రంగారెడ్డికి చెందిన ఆరుష్ రెడ్డి ఎంపికయ్యారు. స్టాండ్ బై ఆటగాళ్లుగా కార్తీక్ తేజ (రంగారెడ్డి) పి.జ్వలిత్(ఖమ్మం) ఎంపికయ్యారు.
  • బాలికల విభాగంలో హైదరాబాద్ కు చెందిన డి.సుశ్రీత, సి.శ్రేష్టరెడ్డి, డి.చైత్రారెడ్డి, కరీంనగర్ కు చెందిన వై.అవనిరెడ్డి, సంగారెడ్డికి చెందిన సిరిచందన ఎంపికయ్యారు. స్టాండ్ బై గా ఖమ్మంకు చెందిన నవ్యశ్రీ, ధరణి ఎంపికయ్యారు.

Related posts

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అదానీ ప్రతినిధులు

Divitimedia

మహిళల ఆర్ధికాభివృద్ధి కోసమే మహిళాశక్తి పధకం

Divitimedia

బీఎస్ఎన్ఎల్ టవర్స్ నిర్మాణానికి భూమి కేటాయింపుపై కలెక్టర్ హామీ

Divitimedia

Leave a Comment