వాయనాడ్ లో ఏరియల్ సర్వే చేసిన ప్రధాని మోదీ
✍️ హైదరాబాదు – దివిటీ (ఆగస్టు 10)
కేరళ రాష్ట్రం వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడి విపత్తు జరిగిన ప్రదేశాన్ని భౌతికంగా సందర్శించే ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఉదయం ఏరియల్ సర్వే చేశారు. ఏరియల్ సర్వేలో ఆయన ఇరువజింజి పూజ (నది) మూలంలో ఉన్న కొండచరియల ప్రాంతాన్ని పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలైన పుంఛిరిమట్టం, ముండక్కై, చూరల్‌మల ప్రాంతాలను కూడా ప్రధాని నరేంద్రమోదీ ఏరియల్ సర్వేలో పరిశీలించారు.