Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleSpot NewsTelanganaWomen

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పాల్వంచ ఎస్సై

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పాల్వంచ ఎస్సై

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 25)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ కేసులో నుంచి శ్రావణి అనే మహిళ నుంచి ఎస్ఐ రాము రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. ఆమె తన కేసు వాదిస్తున్న న్యాయవాది లక్ష్మారెడ్డికి, ఎస్సై లంచం అడుగుతున్న విషయం చెప్పారు. ఈ విషయంపై న్యాయవాది ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా, గురువారం ఏసీబీ అధికారుల బృందం దాడి చేసింది. తన ఇంటి వద్ద ఎస్సై రాము లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది.

Related posts

అడవిజంతువుల వేటపై అప్రమత్తమైన పోలీసు శాఖ

Divitimedia

ప్రణాళిక ప్రకారం భవిష్యత్తు నిర్మించుకోవాలి

Divitimedia

ఆహ్వానించేందుకు వచ్చానన్న కేఏ పాల్, అనుమతి లేదన్న పోలీసులు

Diviti Media News

Leave a Comment