Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleTechnologyTelangana

కొత్తగూడెం త్రీటౌన్ పోలీసుస్టేషన్ లో ఆకట్టుకున్న ‘ఓపెన్ హౌస్’

కొత్తగూడెం త్రీటౌన్ పోలీసుస్టేషన్ లో ఆకట్టుకున్న ‘ఓపెన్ హౌస్’

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయమన్న ఎస్పీ డా.వినీత్

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం

పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం  కొత్తగూడెం త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఆన్లైన్ ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించారు.   ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్  ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, పోలీసుశాఖ ద్వారా ప్రజలకు సేవచేయడం గర్వకారణమన్నారు. దేశ రక్షణకోసం తమ  ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరికీ తెలియజేయడం కోసమే పోలీసు అమరవీరుల దినోత్సవం అక్టోబర్ 21నుంచి నిర్వహిస్తున్నామన్నారు. సైకిల్ ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, వ్యాస రచన, ఫోటోగ్రఫీపోటీలు, ఓపెన్ హౌస్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ  తెలిపారు. ఆన్లైన్ ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని దాదాపు 120 ప్రైవేటు,  ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థులకు ప్రస్తుతం పోలీసుశాఖ ఉపయోగిస్తున్న ఆయుధాలు, బాంబుస్వాడ్ సామాగ్రి, తదితరాల గురించి వివరిస్తున్నామని తెలిపారు. దీనితో పాటు జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న పోలీసు  జాగిలాల పనితీరును కూడా వారికి ఆన్లైన్ ద్వారా వివరించామన్నారు. పోలీస్ అమర వీరుల త్యాగాలను భావిభారత పౌరులైన విద్యార్థులు ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. పోలీసుస్టేషన్ హౌస్ ఆఫీసర్, రిసెప్షన్, స్టేషన్ రైటర్, బ్లూకోల్ట్స్ పనితీరు, పోలీసు వాహనాల వినియోగం గురించి పోలీసుస్టేషన్ లోని అన్ని విభాగాల గురించి వివరించారు. ప్రజలు,యువతీ యువకులు, విద్యార్థులను భాగస్వాములుగా చేస్తూ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ డా వినీత్  అభినందించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, కొత్తగూడెం త్రీ టౌన్ సీఐ మురళి,1టౌన్ సీఐ కరుణాకర్, అడ్మిన్ ఆర్ఐ రవి, ఎంటీఓ సుధాకర్, ఆర్ఐ   వెల్ఫేర్ కృష్ణారావు, ఆర్ఐ నాగేశ్వరరావు, ఐటీ కోర్ ఇంచార్జ్ సీఐ సతీష్, ట్రాఫిక్ ఎస్సై నరేష్, ఏఆర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఢిల్లీలో తెలంగాణ నూతన భవనం : సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

Divitimedia

వచ్చే నెలాఖరులోగా 108ఇళ్లు పంపిణీకి సిద్ధం చేయాలి

Divitimedia

అతని కన్నుపడితే బంగారం మాయమేనా…

Divitimedia

Leave a Comment