Divitimedia
Bhadradri KothagudemEntertainmentLife StyleTelanganaWomen

కలెక్టర్ కార్యాలయంలో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు

కలెక్టర్ కార్యాలయంలో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు

✍🏽 దివిటీ మీడియా – సాంస్కృతిక విభాగం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి (కలెక్టర్) కార్యాలయం ఆవరణలో శుక్రవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు మహిళా ఉద్యోగుల ఉత్సాహంతో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో పలు శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు రంగు రంగుల పూలతో అందంగా రూపొందించిన బతుకమ్మలతో పెద్దసంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల బతుకమ్మకు ప్రత్యేకంగా పూజలు చేసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కలెక్టర్ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐడీఓసీలోని ఉద్యోగినులు ఆటవిడుపుగా, ఉల్లాసంగా బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో జడ్పీ సీఈఓ విద్యాలత, సంక్షేమ అధికారి విజేత, వైద్యాధికారి డా శిరీష, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, తదితర శాఖల అధికారులు, ఉద్యోగినులు పాల్గొన్నారు.

Related posts

60ఏళ్లు నిండినవారందరికీ ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ

Divitimedia

సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి : తుమ్మల

Divitimedia

లక్షమందితో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం

Divitimedia

Leave a Comment