Divitimedia
Bhadradri KothagudemTechnology

పండ్లతోటల్లో పిండినల్లి నివారణకు చర్యలు తీసుకోవాలి

పండ్లతోటల్లో పిండినల్లి నివారణకు చర్యలు తీసుకోవాలి

రైతులకు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి విజ్ఞప్తి

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పండ్లతోటలలో నష్టం చేస్తున్న ‘పిండినల్లి’ నివారణ కోసం రైతులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖాధికారి జినుగు మరియన్న సూచించారు. సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో సాగు చేస్తున్న పండ్లతోటలు, డ్రాగన్ ఫ్రూట్, మామిడి, జామ, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలను సందర్శించిన ఆయన రైతులకు పలు సూచనలు, సాంకేతిక సలహాలిస్తూ, ప్రకటన విడుదల చేశారు. ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు…

  • ఈ పిండినల్లి పురుగులు అన్ని రకాల మొక్కలను ఆశిస్తాయి.
  • అనేక రకాలైన కలుపు మొక్కలు పిండి పురుగులకు ప్రత్యామ్యాయ ఆవాసాలుగా పనిచేసే అవకాశమున్నందున, పంట పొలాల చుట్టూ, గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి.
  • పిండినల్లి ఆశించిన భాగాలు ఎదగకపోగా పంటలో పూత, పిందె రాలుతుంది. మంగు ఏర్పడుతుంది.
  • పిండినల్లి ఆశించిన భాగాలను కత్తిరించి నాశనం చేయాలి.
  • పిండినల్లి నివారణకు ఎసిఫేట్ మందును లీటరు నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పిచికారి చేయాలి.
  • బాగా కుళ్లిన ఎరువు గానీ కంపోస్ట్ గానీ… ఎకరానికి 200 కిలోల వేపచెక్కతో 500 కిలోల వర్మి కంపోస్ట్ కలిపి పంటకు అందించాలి.
  • రైతులు ఉద్యానవనశాఖ ద్వారా ఆయిల్ పామ్, పండ్ల తోటలు సాగు చేసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న అన్ని రాయితీలు పొందాలి.

Related posts

పరిశ్రమల ప్రతినిధులతో ఓటుహక్కుపై కలెక్టర్ సమావేశం

Divitimedia

అక్కాతమ్ముళ్లకు నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం

Divitimedia

సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లా కలెక్టర్

Divitimedia

Leave a Comment