భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరుగా బదిలీపై వచ్చిన డాక్టర్.ప్రియాంక ఆలా శనివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. సాయంత్రం 4.23 గంటలకు ఆమె జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. హైదరాబాదు నుంచి జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్న ఆమె అక్కడ బాధ్యతల నుంచి రిలీవై వచ్చారు. ఇల్లందు విశ్రాంతి గృహానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాకు జిల్లా అధికారులు మొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ శ్రీనివాస్, కలెక్టరేట్
ఏఓ గన్యా, కలెక్టరేట్ పర్యవేక్షకుడు అనంతరామకృష్ణ, లక్ష్మీదేవిపల్లి తహసిల్దార్ నాగరాజు, చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఇల్లందు తహసిల్దార్ కృష్ణవేణి, సిసి దినేష్, తదితరులు స్వాగతం పలికారు.
next post