మూడవ అదనపు జె.ఎఫ్.సి.ఎం బాధ్యతల స్వీకరణ
✍️ దివిటీ (కొత్తగూడెం) ఆగస్టు 28
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు కొత్తగూడెం ‘మూడవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్’ గా వనం వినయ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు వారు రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.రవికుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.