అత్యధిక కేసుల పరిష్కారం కోసం కృషి చేయండి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్

జాతీయ లోక్ అదాలత్ పై కోర్ట్ కానిస్టేబుళ్లతో సమీక్ష
✍️దివిటీ (కొత్తగూడెం) ఆగస్టు 28
వచ్చేనెల (సెప్టెంబర్) 13వ తేదీన జరగ నున్న ‘జాతీయ లోక్అదాలత్’లో ఎక్కువ కేసులు పరిష్కరించడం ద్వారా విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికారసంస్థ మీటింగ్ హాలులో కోర్ట్ కానిస్టేబుళ్లతో జరిగిన సమీక్ష సమావేశంలో, రాజీకాదగిన పెండింగ్ క్రిమినల్ కేసులు, ఇ-పిటి కేసుల వివరాలను ఠాణాల వారీగా అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి అందరు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈసారి జరిగే జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించడం ద్వారా జిల్లాను ఉన్నతస్థానంలో తీసుకురావడం కోసం పోలీసు అధికారులు కృషి చేయాలని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.రాజమల్లు, లైజన్ ఆఫీసర్ ఘని, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.