Divitimedia
Bhadradri KothagudemBusinessFarmingHyderabadKhammamLife StyleSpot NewsTelangana

జిల్లాలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ స్పెషల్ డ్రైవ్

జిల్లాలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ స్పెషల్ డ్రైవ్

✍️ బూర్గంపాడు, అశ్వాపురం, దమ్మపేట – దివిటీ (జులై 10)

తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ, ఆయిల్ ఫెడ్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, అశ్వాపురం, దమ్మపేట మండలాల్లో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఉప్పుసాక గ్రామంలో కొర్సా ముత్యాలరావు, కొర్సా లక్ష్మణరావు, కొర్సా చంద్రశేఖర్, ఇతర గిరిజన రైతులు కలసి మొత్తం 20 ఎకరాల్లో ఆయిల్ పామ్ క్షేత్రంలో మెగా ఆయిల్ పామ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా దమ్మపేట మండలంలోనూ 63 మంది రైతులకు చెందిన147 ఎకరాల్లో పామాయిల్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఫీల్డ్ ఆఫీసర్స్ గ్రామంలో చాలా మంది రైతులు పాల్గొన్నారు. అనంతరం ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, లాభాలు, ప్రభుత్వ రాయితీలు మొదలైన అంశాలు రైతులకు వివరించారు. కార్యక్రమాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి జె.కిశోర్, మణుగూరు ఏడీఏ తాతారావు, ఉద్యానవన శాఖ అధికారి సాయికృష్ణ, ఆయిల్ ఫెడ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ రాధాకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్లు ఫణి, అప్పారావు, రైతులు, స్థానికులు పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ తోటలు ఒకసారి వేసుకుంటే 4వ సంవత్సరం నుంచి గెలల దిగుబడి మొదలై 35 సంవత్సరాల వరకు దిగుబడి ద్వారా ఆదాయం పొందవచ్చని తెలిపారు.

ఆయిల్ పామ్ తోటలో 3 సంవత్సరాల వరకు అంతర పంటల సాగుతో లాభం పొందవచ్చని స్పష్టం చేశారు.

4 సంవత్సరాల వరకు పంట యాజమాన్యం, నిర్వహణ, అంతర పంటల సాగు కోసం ఎకరానికి రూ.4200 చొప్పున ప్రభుత్వం రాయితీ అందజేస్తుందన్నారు.

ఆయిల్ పామ్ పంటకు కోతులు, దొంగల బెడద, దళారీ వ్యవస్థ లేదని, రైతు పండించిన గెలలకు ఖచ్చితమైన మార్కెటింగ్ వ్యవస్థ సదుపాయం ఉందన్నారు.

రైతుకు ఏడాథికి రూ.1,00,000 నుంచి రూ.1,50,000 వరకు ఎకరానికి స్థిరమైన ఆదాయం వస్తుందని వారు వివరించారు.

మొక్క జొన్న పంట ఆశించే కత్తెర పురుగు, పత్తి పంటకు ఆశించే గులాబీ రంగు పురుగుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి మొక్క జొన్న, పత్తి సాగు చేపట్టే రైతులందరూ ఆయిల్ పామ్ సాగుకు మొగ్గుచూపాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ పామ్ ధర టన్నుకు రూ.17000 నుంచి రూ.21,000 వరకు ఉన్నందున నీటి వసతి గల ప్రతి రైతు ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు మొగ్గుచూపాలని సూచించారు.

ఆయిల్ పామ్ తోటల నిర్వహణ, యాజమాన్యం, ఎరువులు, కూలీల ఖర్చులు చాలా తక్కువని, ఒక ఎకరానికి 8 నుంచి10 టన్నులు దిగుబడి వస్తుందని వివరించారు.

బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వడానికి ముoదుoటాయని, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు కూడా ఈ జిల్లాలోనే రెండు ఉన్నాయని తెలిపారు.

10ఎకరాలు ఆయిల్ పామ్ సాగులో ఉన్న రైతు ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగితో సమానంగా ఆదాయం పొందవచ్చన్నారు.

ఆయిల్ పామ్ మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఫీల్డ్ ఆఫీసర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు.

Related posts

అటవీ సంరక్షణ, ఎల్.డబ్ల్యు.ఇ ప్రాంతాల అభివృద్ధిలో సమతూకం లక్ష్యంగా…

Divitimedia

నిబంధనలతో మాకు పనేంటి…?

Divitimedia

రామవరం హైస్కూల్లో ‘ఉత్తమ భవిష్యత్తు’ అవగాహన కార్యక్రమం

Divitimedia

Leave a Comment