నిజమైన జర్నలిస్టు తప్పుడు వార్తలు రాస్తడా?
ఒకర్ని మించి మరొకరు బరితెగింపు…
ప్రతీక్షణం బురద పాత్రికేయం
✍️ హైదరాబాద్ – దివిటీ (జూన్ 30)
ప్రజల కోసం పనిచేసేవారే విలేకర్లు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఫోర్త్ ఎస్టేట్‌గా కీర్తించబడుతున్నారు మీడియా ప్రతినిధులు. ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి కావలిగా పాత్రికేయం లేదనేది యథార్థం. ప్రజా సమస్యల మీద అధికార పార్టీ, ప్రతిప క్షాలు కొట్లాడుకోవడం సర్వసాధారణం. అలా పనిచేస్తేనే అంతిమంగా ప్రజలకు ఉపయో గం. కానీ నేడు ఆ పరిస్థితి కన్పించడం లేదు. పొద్దున నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేవరకు అధికారపక్షం, మీడియాలు కొట్లాడుతున్నాయి లేదా ప్రతిపక్షాలు మీడియాలు కొట్లాడుకుంటున్నాయి. ఇదో ప్రమాదకర పరిణామం. ఇలాంటి పరిణామంతో మీడియా విలువలు పూర్తిగా మసకబారి ప్రజల్లో ఆయా మీడియాల గౌరవం పలచనైంది. ఇందులో ఏ ఒక్క మీడియా మినహాయింపు కానేకాదు. అన్నింటివి అదే తోవ. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని అగ్రశ్రేణి మీడియాల తీరు తెన్నులు జుగుప్స కల్గించేవిధంగా ఉన్నవి. ముఖ్యంగా కొన్ని అగ్రశ్రేణి మీడియాల్లో న్యూస్‌ప్రజెంటర్లు లేదా చర్చలు నడిపే సీనియర్ జర్నలిస్టులుగా చెప్పుకునేవారి తీరు ఒక జర్నలిస్టుగా కాకుం డా కరుడుకట్టిన పార్టీల కార్యకర్తల్లా ఉంటోం ది. ప్రతిపక్షాల ఆధ్వర్యంలో నడిచే మీడియా ల్లో పనిచేసే పెద్ద జర్నలిస్టులుగా పిలవబడే కొందరు అధికార పక్షానికి సవాళ్లు, కౌంటర్లు విసురుతుంటారు. ఇలానే అధికార పక్షం ఆధ్వర్యంలో నడిచే టీవీల్లో పనిచేసే జర్నలి స్టులు ప్రతిపక్షాలకు సవాళ్లు, కౌంటర్లు విసు రుతున్నారు. అసలు జర్నలిస్టుల విధి ఏంటి? జరిగిన విషయాన్ని వెలుగులోకి తీసుకరా వడం.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి గా ఉండటం. అంతిమంగా ప్రజాప్రయోజం కల్గించడం . ఇంతటితో అతని పాత్ర ముగు స్తుంది. కానీ ఆ పాత్రను మీరి రాజకీయ నాయకుల మాదిరిగా సవాళ్లు, కౌంటర్లు వేయడం కాదు. కానీ నేడు బయట సీనియర్ జర్నలిస్టులమని చెప్పుకుంటూ లోపల కరుడు కట్టిన పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న కొంద రి వల్ల యావత్ జర్నలిజం ప్రభ పూర్తిగా దిగ జారింది. కొందరు స్వార్థపరులు తమ పబ్బం గడుపుకోవడం కోసం మొత్తం పాత్రికేయాన్నే తాకట్టుపెట్టి జర్నలిజాన్ని బజారుకీడుస్తు న్నారు. ఇలాంటి దగుల్బాజీ మీడియాల నడు మ నిఖార్సుగా నడిచే మీడియాలను కూడా అదే గాటన కట్టే పరిస్థితి నెలకొనడం బాధా కరం. ఒక పత్రికనో టీవీనో తమకు నచ్చిన పార్టీలకు ఎంతో కొంత అనుకూలంగా ఉండటం గతంలో చూశాం. కానీ నేడు ఆ పరిస్థితి దాటి మీడియాలు పూర్తిగా రాజకీయ పార్టీల ఆఫీసులుగా మారడం దారుణమైన పరిణామమే. ఇలాంటి పరిణామాలు ఎన్ని కలు దగ్గర పడే కొద్ది మరింతగా జడలు విప్పుతున్నాయి. ఏది నిజమో? ఏది అబద్ధమో తెలుసుకోలేని విధంగా ప్రజలను అయోమ యానికి గురిచేసేవిధంగా తమ రాతలు, కూతలు ఉంటున్నాయి. ఇంత బరితెగింపు విధానంలో మొత్తం పాత్రికేయం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వైసిపి వార్తలు చదవాలంటే ఓ పత్రిక..తెలుగుదేశం వార్తలు చూడాలంటే మరో మీడియా…బిఆర్‌ఎస్ కార్యక్రమాలు తెలుసుకోవాలంటే ఇంకో పత్రిక..ఇలా చెప్పుకుంటూపోతే అనేక వింత లుంటాయి. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే ఓ పత్రికలో ఆయన వార్తే కనపడదు..రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దానికి ఇంకో పత్రికలో స్థానమే ఉండదు. నేడు అగ్రశ్రేణి మీడియాలుగా చెలామణిలో ఉన్న మీడియాల్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం వివిధ పార్టీల ఆధ్వ ర్యంలో నడిచే మీడియాలే. మరి అలాంటి మీడియాల్లో ఎలాంటి వార్తలుంటాయి? తమకు నచ్చిన నేతలను ఆకాశానికెత్తడం ..గిట్టని నేతలపై దుమ్మెత్తి పోయడం.. ఇదే కదా నేటి జర్నలిజం. ఇలాంటి జర్నలిజంతో కోట్లాది రూపాయలు దండుకుని కుబేరులుగా మారిన కొందరి మూలంగా యావత్ పాత్రికే యమే పతనావస్థకు చేరింది.ఇప్పుడు తాజాగా మహా టీవీ ఛానెల్‌పై బీఆర్‌ఎస్‌వి కార్యకర్తలు దాడి చేయడంతో మరోమారు ఏది జర్నలి జం? ఏది ఊడిగం? అనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.వాస్తవానికి గత 15 యేండ్ల నుంచి మీడియా విపరీత ధోరణితో ప్రవర్తిస్తోంది. ప్రజా విశ్వాసాన్ని అందుకోవడంలో రోజురోజుకు దిగజారిపో యింది.ప్రతీ రోజూ ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఓ మీడి యాది..ఒక గోల..మరో మీడియాది ఇంకో గొడవ.ఇలా ఎందుకంటే అవన్నీ ప్రజల కోసం పనిచేసే మీడియాలు కావు.ప్రజల కోసం పనిచేసే మీడియాలైతే వాటి రాతలు ..కూతల్లో ప్రజల బతుకు చిత్రమే ఉండేది. కానీ అలా ఉండటం లేదంటే అవన్నీ ఎవరి ప్రయోజనం కోసమో ఇంకెవరి ఊడిగం కోసమో పనిచేస్తున్నవి మాత్రమే.అందుకే నిత్యం తమకు నచ్చిన నేతను ఆకాశానికెత్తడం..గిట్టని నేతలని బజారుకీడ్చడమనే దుర్మార్గమైన పోకడలో పనిచేస్తున్నాయి. ఇలాంటి నీచమైన పనిచేస్తూ దానికి జర్నలి జం అనే ముసుగు వేస్తున్నాయి. జర్నలిజం ముసుగు అని ఎందుకు అనాల్సి వస్తోందం టే…నిజమైన జర్నలిస్టు ఎన్నటికీ తప్పుడు రాతలు రాయడు..తప్పుడు ప్రసారాలు చూప డు.కానీ ఇప్పుడు మహా టీవీ వంటి న్యూస్ ఛానెళ్లతో పాటు మరికొన్ని టీవీలు,మీడియాల వ్యవహారం శృతిమించిపోయింది.తప్పుడు థంబ్‌నైల్స్ పెడుతూ వ్యక్తిత్వహననానికి పాల్ప డుతున్నాయి.ఒక వ్యవహారం మీద విచారణ జరిగే సందర్భంలో మినట్ టు మినిట్ మీడియాలకు విచారణ జరుగుతున్న తీరును విచారణ అధికారులు వివరిస్తారా? అదిగో సిట్ విచారణలో ఇలా జరిగింది? ఆ హీరో యిన్‌ని ఇలా పిలిచారు..ఈ నేతని అలా బ్లాక్‌మెయిల్ చేశారని తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి మొత్తం విచారణ పూర్తయిందని దోషు లు వీళ్ళే అనేవిధంగా తప్పుడు రాతలు రాయ డం పూర్తిగా తప్పుడు జర్నలిజమే.వార్తలను వాళ్ళే వండి వార్చుతారు..బురద జల్లుతారు.. కట్టు కథనాలను ప్రసారం చేస్తారు..చివరికి శిక్షలు కూడా వారే వేస్తారు. సర్వం ప్రపంచం వీరికే తెల్సినట్లు..దైవాంస సంభూతుగా తమని తాము ఊహించుకుంటూ టీవీల్లో చర్చల పేరిట ఊగిపోతుంటారు. ముఖ్య మంత్రులని చూడరు..మాజీ ముఖ్యమంత్రు లను అసలే చూడరు..అందరినీ అదే పిలుపులు..వెటకారపు నవ్వులు..ఛీ..ఛీ వీరా జర్నలిస్టులు అని ప్రజలు ఛీ కొడతున్నారు. అసలు సీనియర్ జర్నలిస్టులుగా చెప్పుకుంటు న్న కొందరు న్యూస్ ప్రజెంటర్లు అనుసరిస్తున్న ధోరణి,వారు ఉపయోగిస్తున్న భాష,వారి హావభావాలు పూర్తిగా బురద పాత్రికేయమే. అరెయ్..ఒరెయ్..అంటూ ఛాలెంజ్‌లు విసురు తూ…పూర్తిగా అదుపు తప్పి మాట్లుడుతూ చర్చలు జరపడం జర్నలిజం అన్పించుకోదు.. ఇప్పుడు మహాటీవీ వంశీతోపాటు ఇంకొన్ని మీడియాల్లో ఉన్న న్యూస్ ప్రజెంటర్లు వ్యవ హారశైలిపై పూర్తిగా ప్రజల్లో అసహ్యం ఏర్ప డిరది.పర్యావసానమే కార్యాలయాలపై దాడు లు.. ధ్వంసాలు.అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలే తప్ప ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి ఎన్నటికీ శ్రేయస్కరం కాదు.ఆ వ్యవ హారాన్ని ప్రతీ ఒక్కరూ ఖండిరచాల్సిందే. అయితే శనివారం మహాటీవీ పైన బీఆర్ ఎస్‌వి కార్యకర్తలు చేసిన దాడిని జర్నలిజం పైన జరిగిన దాడిగా ఎంతమాత్రం చూడ రాదు.అది బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లేదా బీఆర్‌ఎస్ వర్సెస్ తెలుగుదేశం గొడవగానే చూడాలి. ఎందుకంటే మహా టీవీ వంశీది జర్నలిజం అనడం ముమ్మాటికి తప్పే. అతను జర్నలిస్టుగా ఉంటే తమ ఆధ్వర్యంలో నడిచే బాధ్యత కల న్యూస్ ఛానెల్‌లో ఓ బాధ్యత కల రాజకీయ నేతలపైన ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ తప్పుడు హెడ్డిం గులు, దిగజారిన థంబ్‌నైల్స్ పెట్టి ఉండేవారు కాదు.అందుకే మహాటీవీ వంశీ జర్నలిస్టు కాదని అనడం వెనక కారణం అది.ఆయన కండువా కప్పుకో కుండా ఓ పార్టీకి ఊడిగం చేసే వ్యక్తి.అందుకే పార్టీలు,పార్టీల నడుమ జరిగేది కొట్లాటనే తప్ప పాత్రికేయం మీద జరిగిన దాడి ఎంత మాత్రం కాదు. ఒకవేళ ఎవరైనా అలా అను కోకుండా ఇదంతా జర్నలిజం మీద దాడి అంటే..ఇటీవల సాక్షి మీడియా కార్యాలయాలపై కూడా జరిగింది పాత్రికేయం మీద జరిగిన దాడే.మరి నాడు ఇదే మహా టీవీ వంటి మరికొన్ని టీవీల్లో వికృతంగా చర్చలు నడిపారు.సరే..ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదు.అంతమాత్రాన జర్నలి జం ముసుగేసుకుని ఏది పడితే అది చేస్తాం.. మేం రాసిందే రాజ్యాంగం..చూపిందే వేదం అంటే నిఖార్సయిన పాత్రికేయులు ఎన్నటికీ ఊరుకోరు.తమ స్వార్థం కోసం పాత్రికేయ ముసుగేసుకుని పార్టీ కార్యకర్తల్లా వ్యవహరి స్తున్న మహాటీవీ వంశీలాంటి వ్యక్తుల నైజాన్ని ఎండగడుతూనే ఉంటాం.అబద్ధాల పాత్రికే యంపై అక్షర తూటాలను వదులుతూనే ఉంటాం.ఏది నిజమైన జర్నలిజమో..ఏది అబద్ధ పాత్రికేయమో ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉంటాం.అది కొమ్మినేని అయినా వేమూరి అయినా ఒక్కటే. ఎందుకంటే జర్నలి జం బతికి ఉంటేనే అన్ని ఇజాలు మనగలిగేది.మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన ,నిఖార్సయిన ,ప్రజా జర్నలిజం బతకాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.దాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాం. జర్నలిజం కట్టుబాట్లను మీరి సవాళ్లు, ప్రతి సవాళ్లు వేస్తూ పూర్తిగా పార్టీల కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పాత్రికేయులను, ఆయా మీడియాలను పాఠకుడు పాతరేసేలా ప్రజల్లో చైతన్యం రావాలి. జర్నలిజం ముసుగేసుకుని కరుడుగట్టిన పార్టీల కార్యకర్తల్లా చెలరేగిపోతు న్న కొందరి లోగుట్టులను ప్రజలు తెలుసుకో గలగాలి. అప్పుడే ఏది నిజమైన జర్నలిజమో? ఏది ముసుగు జర్నలిజమో ప్రజలు గుర్తుపట్ట గలుగుతారు. ఆ దిశగా అంతా ఆలోచిం చాల్సిన సమయం ఇదే.
…మానసాని కృష్ణా రెడ్డి(ఎడిటర్) – 8074124190