Divitimedia
Bhadradri KothagudemBusinessEducationLife StyleSpot NewsTechnologyTelanganaYouth

చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి : కలెక్టర్ జి.వి.పాటిల్

చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి : కలెక్టర్ జి.వి.పాటిల్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జూన్ 27)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లల ఆధార్ నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో విద్య, గ్రామీణాభివృద్ధి, బ్యాంకు, పంచాయతీ, తపాలా, మున్సిపల్,  రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ,  జిల్లాలోని 5 సంవత్సరాలలోపు గల పిల్లలందరి ఆధార్ నమోదు తప్పక చేయించాలన్నారు. ప్రతి మండలంలో ఆధార్ నమోదుకేంద్రాలు పనిచేయాలని, 5, 15 సంవత్సరాలు దాటిన వారు తమ ఆధార్ బయోమెట్రిక్ చేయించుకోవాలని తెలిపారు. ఆధార్ లేని వారిని గుర్తించి నమోదు చేయించాలని ఆదేశించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పౌరసేవలు పొందాలంటే ఆధార్‌ అప్‌ డేట్‌ తప్పనిసరన్నారు. ఉద్యోగాల దరఖాస్తులు, బ్యాంకు ఖాతాలు, ధ్రువపత్రాలు పొందేందుకు, స్థలాల రిజిస్ట్రేషన్‌, సిమ్‌ కార్డులు పొందాలంటే ఆధార్‌ అప్‌ డేట్‌ తప్పక చేసుకోవాలని సూచించారు. పదేళ్ల క్రితం ఆధార్ పొందిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా నవీకరించుకోవాలని సూచించారు. ఆధార్‌ ఆధారిత సేవలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ కార్డులోని వివరాలు పునరుద్ధరించుకోవాలని పేర్కొన్కారు. అంగన్వాడీ కేంద్రాలు, హాస్పిటల్స్, పాఠశాలల్లో ఆధార్‌ నమోదు ప్రక్రియ చేపట్టి వందశాతం పూర్తిచేసేలా చూడాలని, విద్యాసంస్థలతో సమన్వయం చేసుకుని పూర్తిచేయాలని సూచించారు. అప్‌ డేట్‌ ప్రక్రియ పట్ల  ఆధార్‌ సేవాకేంద్రాలకు తగిన సూచనలు చేయాలని ఇ-డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ ను కలెక్టర్  ఆదేశించారు. వివరాల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1947, HELP@uidai.net.in ను వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఆధార్ నమోదుకేంద్రాలు, ఆధార్ కార్డులపై అభ్యంతరాలుంటే కలెక్టరేట్ లోని ఇ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావును సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ యుఐడి అసిస్టెంట్ మేనేజర్ మొహ్మద్ సౌభన్, కొత్తగూడెం ఆర్టీఓ మధు, జడ్పీ డెప్యూటీ సీఈవో చంద్రశేఖర్, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, ఎల్డీఎం రామిరెడ్డి, విద్యాశాఖ జిల్లా అధికారి వెంకటేశ్వరచారి, సెర్ప్ అధికారి నీలయ్య, మీసేవ జిల్లా మేనేజర్ రఘు కుమార్, సంభంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

వలస ఆదివాసీ గ్రామంలో పోలీసుల ఉచిత వైద్య శిబిరం

Divitimedia

పండ్లతోటల్లో పిండినల్లి నివారణకు చర్యలు తీసుకోవాలి

Divitimedia

లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

Leave a Comment